Saturday, May 4, 2024

Breaking | హైదరాబాద్​లో మోస్తరు జల్లులు.. కూల్​ వెదర్​తో సిటీ జనం రిలీఫ్​

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలున్నప్పటికీ సాయంత్రమయ్యే సరికి వాతావరణం చల్లబడింది. సాయంత్రం కురిసిన జల్లులతో వెదర్​ కూల్​ కావడంతో నగరవాసులు కొంత రిలీఫ్ పొందారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవ్వాల సాయంత్రం మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురిసింది.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, మియాపూర్‌, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, సుచిత్ర, కొంపల్లి, గాజులరామారం, సురారం, కూకట్‌పల్లి, బాలానగర్‌, చింతల్‌, నార్సింగి, కొంపల్లి, కోకాపేట్‌, అల్వాల్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, పటాన్‌చెరు, నిజాంపేట, లింగంపల్లి, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement