Friday, May 3, 2024

బింగ్‌లో మైక్రోసాఫ్ట్‌ చాట్‌జీపీటీ

మైక్రోసాఫ్ట్‌ తన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను యాడ్‌ చేసింది. దీంతో ఛాట్‌ జీపీటీ తరహా సేవలు అందిస్తామని ప్రకటించింది. టెక్నాలజీ రంగంలో చాట్‌జీపీటీ పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తుంది. యూజర్లకు ఇది తక్కువ సమయంలో కచ్చితమైన, అవసరమైన సమచారం ఇస్తుందని ఈ టూల్‌ను అభివృద్ధి చేసిన ఓపెన్‌ ఏఐ చెబుతున్నది. చాట్‌జీపీటీతో సెర్చ్‌ ఇంజిన్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ దిశగా సెర్చ్‌ ఇంజిన్ల కూడా అడుగులు వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే గూగుల్‌ ఏఐ ఆధారిత బార్డ్‌ను ప్రకటించింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ దాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. ఏఐ ఆధారిత అన్సర్‌ ఇంజిన్‌ ద్వారా ఈ సేవలు అందిస్తామని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ప్రస్తుతాని వెయిట్‌ లిస్ట్‌ ప్రాసెస్‌లో సేవలు అందిస్తోంది. ఈ సేవలను యాక్సెస్‌ చేయాలనుకునే వారు ముందుగా వెయిట్‌ లిస్ట్‌లోకి చేరాలి. తరువాత మీ వంతు వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్‌ నుంచి సమాచారం వస్తుంది. అప్పుడు డెస్క్‌టాప్‌లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయ. మొబైల్‌ ఫోన్లలో ఎప్పడి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నది ఇంకా వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement