Tuesday, November 12, 2024

METROసంక్రాంతి బంప‌ర్ ఆఫ‌ర్ …రూ.59కే అన్ లిమిటెడ్ ప్ర‌యాణం..

హైద‌రాబాద్ – రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఈ సందర్భంగా చాలా మంది నగరాల నుంచి గ్రామాలకు వెళుతున్నారు. ఈ సమయంలో గ్రామాల నుంచి పట్టణానికి కూడా వస్తుంటారు. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ ప్ర‌యాణీకుల‌కు శుభవార్త అందించింది.

తాజాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి 3 రోజుల అపరిమిత ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. మెట్రో కార్డ్ హోల్డర్లు రూ.59 రీఛార్జ్ చేయడం ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. జనవరి 13, 14, 15 తేదీల్లో మెట్రో హాలిడే కార్డు వర్తిస్తుందని, ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఆ రోజంతా రైలులో ప్రయాణించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ మంచి అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement