Monday, April 29, 2024

చిన్న కుమారై శ్రీజ‌కి.. 35విలువైన గిఫ్ట్స్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి త‌న చిన్న కుమారై శ్రీజ కోసం కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాస్ట్లీ గిఫ్ట్ అంటే ఏ కారో, బంగారమో అనుకుంటాం.. కానీ చిరు ఏకంగా రూ 35 విలువైన గిఫ్ట్ ఇచ్చారట. శ్రీజ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో చిరంజీవి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటిని చిరంజీవి తన సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో కొన్నారట. చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. చిరంజీవికి తన పిల్లలు అంటే ఎంత ప్రేమో ఈ సంఘటనే నిదర్శనం.

ఇక రాంచరణ్ కూడా తన అక్క చెల్లెళ్లపై ఎంతో ప్రేమ చూపిస్తారు. ఆ మధ్యన శ్రీజ డిప్రెషన్ లో ఉంటే రాంచరణ్ వెకేషన్ కి తీసుకువెళ్లాడు. శ్రీజకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల తన తండ్రి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా మారారు. రాంచరణ్ చిత్రాలకు కూడా ఆమె పనిచేసారు. అలాగే నిర్మాతగా కూడా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీజ భవిష్యత్తులో సినిమా రంగంలోకి అడుగుపెడుతుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement