Thursday, May 16, 2024

మెగాస్టార్ 154నుండి అప్ డేట్..రేపే టైటిల్ టీజర్

మెగా ఫ్యాన్స్ కి పండుగే..అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.. మెగా స్టార్‌ చిరంజీవి నటిస్తోన్న మెగాస్టార్ 154మూవీనుండి అప్ డేట్ వచ్చింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మాస్‌ మహారాజు రవితేజ కూడా నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ ను రేపు ఉదయం 11.07 AM గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ ప్రోమో రిలీజ్‌ చేశారు. ఇక ఇందులో చిరు లుక్‌ కనిపించకపోయినా.. ఆయన సిగరేటు తాగుతూ కనిపించారు. ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement