Tuesday, May 7, 2024

మెగా వారి కోడ‌లు కానున్న- యాంక‌ర్ మేఘ‌న‌

మెగా వారి కోడ‌లు కానుంది యాంక‌ర్ మేఘ‌న‌. మెగా ఫ్యామిలీ నుండి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో నటుడు పవన్ తేజ్ ఓ ఇంటివాడు అవుతున్నాడు. సినీ నటి, బుల్లితెర యాంకర్ మేఘనను ఆయన పెళ్లాడబోతున్నాడు. వీరి నిశ్చితార్థం ఘ‌నంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, సినీ దర్శకుడు మెహర్ రమేశ్, నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ తేజ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ… ప్రేమతో తమ ప్రయాణం మొదలైందని… ఆమె వల్లే ప్రేమ అంటే ఏమిటో తనకు అర్థమయిందని చెప్పాడు. ఈ వేడుకకు వచ్చి తమను ఆశీర్వదించిన చిరంజీవి బాబాయ్, సురేఖ చిన్నమ్మకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నాడు. చిన్నతనం నుంచి బాబాయ్ తనకెంతో సపోర్ట్ చేశారని చెప్పాడు. పవన్ తేజ్, మేఘన ఇద్దరూ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరికీ పరిచయం కలిగింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఇప్పుడు వీరిద్దరూ పెద్దల అంగీకరంతో పెళ్లి చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement