Sunday, April 28, 2024

Latest | మెగా మ‌ల్టీస్టార‌ర్ బ్రో.. టీజర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్

మెగా అభిమానులందరికీ గుడ్ న్యూస్.. సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ క‌లిసి చేస్తున్న మెగా మల్టీస్టార‌ర్ బ్రో.. ఈ ఫాంటసీ కామెడీ మూవీ వ‌చ్చే నెల (జూలై) 28న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. కాగా, ఈ మూవీ నుంచి ఎప్పటిక‌ప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా, ఈ మూవీ టీజ‌ర్ కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ టీజర్ రేపు సాయంత్రం 05:04 గంటలకు రిలీజ్ కానుంది.

టీజర్‌ విడుదలకు సంబంధించి మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక‌ పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం టీజర్ కోసం డబ్బింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. రానున్న రోజుల్లో ప్రమోషన్ల జోరు పెంచేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో టిజి విశ్వ ప్రసాద్ ఈ బిగ్గీకి మద్దతు ఇస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement