Tuesday, May 7, 2024

టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తుకు మే 6 చివరి తేదీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మే 6 ఆఖరు తేదీ. ఈమేరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొ.పి.వరలక్ష్మీ తెలిపారు. అయితే ఆలస్య రుసుము రూ.250తో ఈనెల 12 వరకు, రూ.500తో 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈనెల 26, 27 తేదీల్లో జరగబోయే ఐసెట్‌ పరీక్షకు 20 ఆన్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఐసెట్‌కు ఈనెల 6వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement