Sunday, May 19, 2024

పరవళ్ళు తొక్కుతున్న మంజీరా – సాలూర వద్ద నిలిచిపోయిన రాకపోకలు

నిజాంబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూరు గ్రామం వద్ద మంజీరా నది నీటితో పరవళ్ళు తొక్కుతుంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర నుండి భారీగా వరద నీరు వచ్చి మంజీరా నదిలో కలుస్తుంది. మహారాష్ట్రకు సాలూరు గ్రామం సరిహద్దుగా ఉండడం ఇరు రాష్ట్రాలకు సరిహద్దులో మంజీరా నది ఉన్నది. మంజీరా నది పరవాలేదు తొక్కడంతో నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జిపై నీళ్లు ప్రవహించడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 30 ఏళ్ల క్రితం మంజీరా నదిపై హై లెవెల్ వంతెన ను నిర్మించడం జరిగింది.

వంతెన శిధి లావస్థకు చేరడంతో గత ఏడాదిగా వంతెన పై నుండి రాకపోకలు నిలిపివేశారు. పాత వంతెన పక్కనే మరో హై లెవెల్ వంత నిర్మించుటకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.అట్టి నిధులతో ఏడాది నుండి వేగవంతంగా వంతెన పనులు పూర్తి కావస్తున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన లో లెవెల్ వంతెన పైనుండే ఏడాదిగా మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగుతున్నాయి.
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది నీటి ప్రవాహం పెరగడంతో పాత వంతెనపై నీళ్లు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. అధికారులు అప్రమత్తమై మహారాష్ట్రకు రాకపోకలు నిలిపేశారు. మహారాష్ట్రకు నిజాంబాద్ బోధన్ ప్రాంతాలకు వ్యాపారంగా బంధుత్వ పరంగా పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి. ప్రతిరోజు వేలాదిమంది మహారాష్ట్ర నుండి తెలంగాణకు బోధన్ నుండి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున రాకపోకలు కొనసాగిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement