Thursday, May 2, 2024

జోరుమీదున్న దర్శకుడు మణిరత్నం.. పొన్నియిన్ సెల్వన్2 రిలీజ్ డేట్

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్..మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్‌ 30న ప్రపంచ వ్యప్తంగా రిలీజ్ అయ్యి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళంలో మాత్రం కలెక్షన్‌ జోరు చూపించింది. ఈ ఏడాది అత్యధిక గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది. కేవలం తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 460 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించింది సినిమా. మొదటిపార్ట్ ఇచ్చిన బూస్ట్ తో ఈ మూవీ పార్ట్ 2 పనులు స్టార్ట్ చేశాడు దర్శకుడు మణిరత్నం. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు టీమ్. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు తమిళ సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌ లాంటి స్టార్ యాక్టర్స్ నటించిన ఈసినిమాను మణిరత్నం.. తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ఇక రెండు పార్ట్ లా ఈసినిమాను ప్రకటించిన మణిరత్నం ఫస్ట్ మూవీతో హిట్ కొట్టాడు. ఇక అదే జోష్ తో పొన్నియన్‌ సెల్వన్‌ రెండో భాగంపై దృష్టి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement