Sunday, April 28, 2024

Cyclone Mandous  : మండూస్ ఎఫెక్ట్.. తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

మండూస్‌ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తుండ‌డంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తమిళనాడు తీరంలోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున రెడ్‌ అలర్ట్‌ జారీచేసినట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్ తుఫాన్ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుపాన్ తీరాన్ని తాకే సమయంలో తమిళనాడు ఉత్తర తీరంతోపాటు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పుదుచ్చేరి, శ్రీహరికోటకు మధ్య, మహాబలిపురం చుట్టుపక్కల 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మండూస్‌ తుఫాను నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని పార్కులను, ప్లే గ్రౌండ్‌లను మూసివేయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పార్కులను, ప్లే గ్రౌండ్‌లను తెరువద్దని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement