Wednesday, May 22, 2024

‘గాలి నాగేశ్వరరావు’గా మంచు విష్ణు

మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్‌, చోటా.కె.నాయుడు, అనూప్‌ రూబెన్స్‌ వంటి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మోహన్‌ బాబు ఆశీస్సులతో విష్ణు మంచు హీరోగా ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు కోన వెంకట్‌. చోటా.కె.నాయుడు కెమెరామెన్‌గా.. భాను, నందు సంభాషణలు అందిస్తున్న ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

జి.నాగేశ్వర రెడ్డి మూలకథ అందించారు. కాగా ఈ సినిమాలో తన చేస్తున్న ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్‌ గెటప్‌ ని తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసారు మంచు విష్ణు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించడానికి ప్లాన్‌ చేస్తోంది చిత్రం యూనిట్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement