Tuesday, May 21, 2024

మలయాళ నటుడు శ్రీజిత్‌పై లైంగిక ఆరోపణలు… అరెస్ట్‌ చేసిన పోలీసులు

మలయాళ సినీ నటుడు శ్రీజిత్‌రవి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయనను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోక్సో చట్టం క్రింద అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మైనర్‌ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్‌ చేశారు. ఫిర్యాదు దారులు తెలిపిన వివరాల ప్రకారం త్రిసూర్‌లో ఈ ఇద్దరు బాలికలను తన కారులో ఎక్కించుకుని శ్రీజిత్‌ రవి అసభ్యంగా ప్రవర్తించాడు.

సీసీటీవీ ఫుటేజిలో నల్లటి కారు కనిపించింది. ఆ కారు శ్రీజిత్‌దేనని తేలింది. మైనర్‌ బాలికల ఎదుట శ్రీజిత్‌ తన బట్టలు విప్పి నగ్నంగా నిల్చున్నట్లు ఫిర్యాదుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీజిత్‌ను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement