Monday, April 29, 2024

రామగిరి ఖిల్లాను, ధూళికట్టను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీసీ సంఘాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చరిత్రకు సజీవ సాక్ష్యమైన పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిందిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి బీసీ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన బీసీ సంఘం నాయకులు ఆకుల స్వామి వివేక్ పటేల్, ఉప్పు రవీందర్ పటేల్ రామగిరి ఖిల్లా, బౌద్ధ స్తూప ధూళికట్ట, సబితం జలపాతం, కొమరవెల్లి మల్లన్న దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు.

కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యం వల్ల పర్యాటక ప్రాంతాలు కళాహీనమవుతున్నాయని, ప్రాచీన సంస్కృతికి, కళావైభ వానికి అద్దం పట్టిన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం వుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది అరుదైన కళాసంపదను కాపాడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement