Saturday, December 7, 2024

Makara Jyothi – నేడు శ‌బ‌రిమ‌ల‌లో మ‌క‌ర జ్యోతి ద‌ర్శ‌న భాగ్యం…. ల‌క్ష‌లాదిగా త‌ర‌లివచ్చిన అయ్య‌ప్ప భ‌క్తులు..

శబరిమలలో నేటి సాయంత్రం మకర జ్యోతి దర్శన భాగ్యం కలుగనుంది.. కనులారా ఈ జ్యోతిని ద‌ర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు శ‌బ‌రిమ‌ల‌లో వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి.

ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. ఈ జ్యోతి దర్శనం చేసుకునేందుకు అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకోవడం సంప్రదాయంగా వస్తుంది. మకర జ్యోతి దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని అయ్యప్ప భక్తులు భావిస్తారు.

ఇక, అయ్యప్ప స్వామి మాల వేసుకునే ప్రతి ఒక్క భక్తుడు మకర జ్యోతి దర్శనం చూడాలని కోరుకుంటారు. జ్యోతి దర్శనం కోసం నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి మాల వేసుకుని కఠినమైన దీక్ష చేస్తారు. ఇక, శబరిమల కొండల్లో కనిపించే మకర జ్యోతి దర్శనం చేసుకుంటే.. తమ జీవితం ధన్యమయినట్లేనని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు శబరిమలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని ముందుగా అంచనా వేసుకుని ట్రావెన్ కోర్ దేవస్థానం అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement