Thursday, May 2, 2024

సెప్టెంబర్ 17 నుంచి నితిన్ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించినా.. 10న టక్ జగదీష్ రిలీజ్, థియేటర్లలో పలు సినిమాల విడుదలను పరిగణనలోకి తీసుకున్న డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుంచి మాస్ట్రో సినిమా స్ట్రీమింగ్ అవుతుందని డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ తెలియజేసింది.

కాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవుతున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. ఈ సందర్భంగా సినిమాలోని ప్రధాన తారాగణం అంతా ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా హిందీ బ్లాక్ బస్టర్ హిట్ ‘అంధాదున్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ ‘మాస్ట్రో’. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ వార్త కూడా చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పీవీ సింధుకు ఘన సత్కారం

Advertisement

తాజా వార్తలు

Advertisement