Saturday, April 27, 2024

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూవీ రివ్యూ-ద‌ర్శ‌కుడిగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి స‌క్స‌స్ అయ్యాడా

హీరో నితిన్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంర్ టైన‌ర్ చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

క‌థ – గత ముప్పై ఏళ్లుగా ‘మాచర్ల నియోజకవర్గం’నుండి ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న ఎమ్మెల్యే రాజప్ప (సముద్రఖని). ఆ నియోజకవర్గంలో తనకు ప్రతిపక్షమే లేకుండా చేసి,ఎన్నికలు జరగనివ్వడు. ఎప్పుడూ ఇనానమస్ గా గెలవటమే. తన అంగబలం,అర్దబలంతో నియంతలా పాలిస్తూంటాడు. మాచర్లను శాసిస్తూంటాడు. అక్కడ తన రాజ్యాన్ని స్దాపిస్తాడు. ఎన్నికలు జరపాలని ప్రయత్నించిన కలెక్టర్ ని చంపేస్తాడు. వైజాగ్‌లో కుర్రాడు సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ పూర్తి చేసి పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉంటాడు. అతన్ని మినిష్టర్ కుమార్తె ఝాన్సి (క్యాథరిన్ ట్రెసా) ప్రేమిస్తుంటుంది. కానీ అతను అదేమీ పట్టించుకోకుండా వైజాగ్ బీచ్‌లో కనిపించిన స్వాతి (కృతి శెట్టి) తో ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను చెప్పి ఒప్పించాలనుకునేలోపు ఆమె వెళ్లిపోతుంది. స్వాతిని వెతికి, దగ్గర అవుదామనుకూంటే రాజప్ప కొడుకు వీర ..ఆమెను చంపటానికి ప్రయత్నిస్తాడు. సిద్దు కాపాడతాడు. చివరకు ఏమైంది…ఆ నియోజక వర్గంలో ఎలక్షన్స్ మళ్లీ జరిపించారా .. వంటి విషయాలు తెలియాలంటే మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చూడాల్సిందే.

విశ్లేష‌ణ – ద‌ర్శ‌కుడు ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డికి ..ఎడిటర్ గా ఎంతో పేరుంది. అయితే తన తొలి సినిమాని పక్కా మాస్,కమర్షియల్ గా చేయాలని ఇరవై ఏళ్ల నుంచి వస్తున్న సినిమాల్లో సీన్స్ ని ముందేసుకుని కథ రెడీ చేసుకున్నాడు. అంతా మూస వ్యవహారమే. హీరో,హీరోయిన్స్, విలన్ ఇలా వరస పెట్టి కంటిన్యూ ట్రాక్ లు వస్తూంటాయి. విలనిజం కూడా ఎప్పుడో ముగిసిపోయిన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లు అనిపిస్తుంది. కథకేముంది ఏ కథ కొత్తది అంటే…దాని స్క్రీన్ ప్లే, ప్రెజంటేషన్ అయినా కొత్తగా ఉండేలా సాధారణంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ అదీ పాత వాసనే కొడుతూంటుంది. స్క్రీన్ ప్లే గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ తప్ప మరేమీ లేదు. సెకండాఫ్ లో అదీ లేదు..క్లైమాక్స్ అయితే చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు.

- Advertisement -

టెక్నికల్స్ – దర్శకుడు గా రాజశేఖర్ రెడ్డి మారుతున్న తెలుగు సినిమా పరిణామక్రమాన్ని గమనిస్తున్నట్లు లేరు…పరమ రొటీన్ కథ,కథనాన్ని ఎంచుకోవటంతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాసం కనపడలేదు. పాతదాన్ని అంతే పాతగా ప్రెజెంట్ చేసారు. డైరక్టర్ కు తగ్గట్లే టెక్నీషియన్స్ అందరూ టిపికల్ కమర్షియల్ రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ పాటల్లో ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచిన ‘రారా రెడ్డి’, ‘రాను రాను’ సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం…థమన్ ని అనుకరిస్తున్నట్లు గా బాగా లౌడ్ గా ఉంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి జస్ట్ ఓకే. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ ల్యాగ్ లు లేకుండా బాగుంది. అయితే రన్ టైమ్ తగ్గించాల్సింది.

నటీనటులు – నెరిసిన జుట్టు, మెలితిరిగిన మీసం, నుదిటిన తిలకం, మెడలో రుద్రాక్షమాలతో వింటేజ్ పొలిటిషియన్ లుక్ లో సముద్ర ఖని డిఫరెంట్ గా ఉన్నారు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ కొత్తగా అనిపించకపోయినా నవ్వించింది. నితిన్ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు. స్పెషల్ సాంగ్ ‘రారా రెడ్డి’ లో నితిన్, అంజలి ల కెమిస్ట్రీ, మాస్ డ్యాన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కృతి శెట్టి ఓకే. కేథరిన్ థ్రెసా గురించి అయితే చెప్పుకోవటానికి ఏమీ లేదు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, శ్యామల వంటి వారు సినిమా చేస్తున్నాం కాబట్టి చేసాం అన్నట్లు కనపడి వెళ్లిపోతారు.ఓవ‌రాల్ గా సినిమా చూసే వారి విధానం బట్టి జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయన్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement