Friday, April 26, 2024

ఈనెల 26వరకు అనంతబాబు రిమాండ్ పొడిగింపు

వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు మే నెల 23వతేదీ నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉంటున్నాడు. అయితే ఆయన రిమాండ్ ను రాజమండ్రి కోర్టు ఈనెల 26వ తేదీ వరకు పొడిగించింది. రిమాండ్ పొడిగింపుతో అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాకినాడ పోలీసులు ఈ కేసులో ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement