Friday, March 29, 2024

విల‌న్ గా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి-అదిరిన పోస్ట‌ర్ లుక్

ఈ ఏడాది సెహ‌రి సినిమాతో సిల్వ‌ర్ స్క్క్రీన్‌పై న‌టుడిగా ఎంట్రీ ఇచ్చారు సంగీత ద‌ర్శ‌కుడు కోటి. ఇందులో హీరో తండ్రిగా న‌టించారు కోటి. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇపుడు కొత్త అవ‌తారంతో అంద‌రినీ ప‌లుక‌రించ‌బోతున్నారు. ఈ సారి విల‌న్‌గా భ‌య‌పెట్టించేందుకు రెడీ అవుతున్నారు కోటి. అభిలాశ్ సుంక‌ర‌, దీపికా ఆరాధ్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ప‌గ ప‌గ ప‌గ . వుయ్యూరు ర‌వి శ్రీ దుర్గ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి కోటి లుక్ ను లాంచ్ చేశారు. కోటి స్టైలిష్‌గా మాసీ లుక్‌లో అద‌ర‌గొట్టేస్తున్నారు. సుంక‌ర బ్ర‌ద‌ర్స్-AarDeePee సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోటి మ్యూజిక్ అందిస్తుండ‌టం విశేషం. విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement