Friday, May 17, 2024

LSG vs DC | ఢిల్లీతో పోరులో టాస్ నెగ్గిన ల‌క్నో..

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు జ‌రుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయంట్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్ టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ :

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

లక్నో సూపర్ జెయింట్స్ :

లోకేశ్ రాహుల్ (c & wk), క్వింటన్ డి కాక్, దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, యశ్ రవిసింగ్ ఠాకూర్.

- Advertisement -

ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరిగాయి. ఈ మూడింట్లో కూడా లక్నో గెలవడం విశేషం. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక దాంట్లో విజయం సాధించి, పాయింట్ల టేబుల్ పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది ఢిల్లీ. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి అత్యంత కీలకంగా మారనుంది. ఇక లక్నో విషయానికి వస్తే ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి.. 6 పాయింట్లతో టేబుల్ పట్టికలో మూడో స్థానంలో ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వంలో జట్టు సమష్టిగా ముందుకెళుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement