Friday, April 26, 2024

ఆగస్టులోనే రానున్న ‘లవ్ స్టోరీ’

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. సున్నితమైన భావోద్వేగాలతో ఆయన ప్రేమకథలు కొనసాగుతాయి. అందుకే యూత్‌లో ఆయన సినిమాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా రూపొందింది. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

ఏప్రిల్ నుంచి మే నెలకు వాయిదా పడిన ఈ సినిమా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల కాలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తుండటంతో ఆగస్టులో విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చాడు. సాయిపల్లవిపై చిత్రీకరించిన ‘సారంగధరియా ..’ పాట ఇప్పటికే పాపులర్ అయింది .. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో రావు రమేష్, దేవయాని, ఈశ్వరీరావు ముఖ్యపాత్రలను పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement