Saturday, May 4, 2024

సింగిల్‌ పర్మిట్‌ విధానం, ఫిట్నెస్ ఫీజులు తగ్గించండి … కెటిఆర్ కి లారీ య‌జ‌మానుల విన‌తి

షాద్ నగర్ ప్రభా న్యూస్ జూలై 20 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలు చేయాలని, ఫిట్నెస్ ఫీజులు తగ్గించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. గురువారం అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ రామచంద్ర రెడ్డి, జనరల్ సెక్రెటరీ చాంద్ పాషా, కోశాధికారి సుధాకర్ గౌడ్ తదితరులు కలిసి మంత్రి కేటీఆర్ కు తమ సమస్యలు విన్నవించుకున్నారు.

సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ రవ అధ్యక్షుడు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హామీ ఇచ్చినట్టు అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ తెలిపారు. ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరించి లారీ వ్యవస్థకు మంచి ఊపు ఇచ్చిందని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు పుష్పగుచ్చాన్ని అందించారు. అనంతరం కేటీఆర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్, రామచంద్ర రెడ్డి, జనరల్ సెక్రెటరీ చాంద్ పాషా, కోశాధికారి సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement