Thursday, May 2, 2024

దశాబ్దకాలంగా పచ్చి కూరగాయలే ఆహారం.. చివరకు ఆకలితోనే మృతి

సంవత్సరాల తరబడి పూర్తిగా పచ్చి శాకాహార ఆహారంతో జీవించిన 39 ఏళ్ల ఝన్నా డి ఆర్ట్‌ (శామ్సోనోవా) చివరకు ఆకలితో మరణించింది. న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం, రష్యన్‌ జాతీయురాలైన ఝన్నా వేగన్‌ రా ఫుడ్‌ గురించి తన సోషల్‌ మీడియా ఖాతాలలో విస్తృతంగా ప్రచారం చేస్తుండేది. నా శరీరం, మనస్సు ప్రతిరోజూ రూపాంతరం చెందడాన్ని గమనిస్తున్నాను అని తన నిర్బంధ ఆహార నియమాన్ని వివరిస్తూ శామ్సోనోవా చెప్పింది. అయినప్పటికీీ నా అలవాట్ల నుంచి ఎన్నటికీ దూరంగా వెళ్లను అని తేల్చిచెప్పింది. ఇటీవల ఆమె ఆగ్నేయాసియా పర్యటనకు వెళ్లినప్పుడు అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి వైద్యచికిత్స పొందుతూ వచ్చింది. పరిస్థితి విషమించడంతో గతనెల 21న మరణించింది.

ఝన్నా ఇన్‌స్టా సమాచారం ప్రకారం, దాదాపు దశాబ్దంపాటు ఆమె ముడి శాకాహారాన్ని తీసుకుంటూ వచ్చింది. కొన్నినెలల కిందట శ్రీలంకలో కాళ్లవాపు సమస్యను ఎదుర్కొంది. బాగా అలసిపోయినట్లు కనిపించింది. కాళ్లవాపు నుంచి శోషరసం స్రవిస్తుండేది. ఆమెను చూసినేను భయపడ్డాను అని ఒక స్నేహితుడు చెప్పుకొచ్చాడు. నేను ఆమె ఉంటున్న భవనంలోనే పై అంతస్తులో నివశించాను.

ప్రతిరోజు ఉదయం ఆమెను చూసి చలించిపోయేదాన్ని. ఇలాగైతే ఏదోఒకరోజు ఆమెను నిర్జీవంగా చూడాల్సి వస్తుందేమోనని భయపడేదాన్ని. చివరకు అతికష్టంమీద ఝన్నాను చికిత్సకు ఒప్పించాను. కానీ ఆమె సకాలంలో స్పందించలేదు అని ఆమె స్నేహితురాలు ఒకామె చెప్పింది. కాగా, తన కుమార్తె కలరాతో చనిపోయిందని ఝన్నా శామ్సోనోవా తల్లి చెప్పారు. శాకాహారి ఆహారం కారణంగా ఆమె శరీరం అలసటకు గురైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అయితే మరణానికి గల కారణాలు అధికారికంగా వెల్లడికాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement