Friday, May 3, 2024

లైగర్’ ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ ఫుల్ సాంగ్ రిలీజ్.. ప‌క్కా పార్టీ సంగ్..

విజరు దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేష‌న్‌లో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “లైగర్” (సాలా క్రాస్‌బ్రీడ్). తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ను ప్రారంభించారు మేక‌ర్స్. కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ ప్రోమోను జూలై 8న విడుదల చేయగా, అదే పాట ఫుల్ సాంగ్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాటను పబ్ సెట్‌లో చిత్రీకరించారు. కాగా, తెలుగులో భాస్కరభట్ల, రవికుమార్ సాహిత్యం అందించిగా.. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు. ప్రమోషన్ మెటీరియల్‌తో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు మ‌రింత‌ పెరిగిపోతున్నాయి.

పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా ఈ రూపొందింది. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండ‌గా.. తరులాండ్‌కి చెందిన కెచ్చా స్టంట్ మాస్టర్‌గా ప‌నిచేశారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement