Saturday, May 18, 2024

షూటింగ్ పూర్తిచేసుకున్న సమంత ‘యశోద’.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్.!

‘యూ టర్న్’ .. ‘ఓ బేబీ’ వంటి హిట్స్ త‌ర్వాత‌ సమంత చేస్తున్న ఫీమేయిల్ లీడ్ రోల్ మూవీ ‘యశోద‌’. టైటిల్ ను ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. అద్భుతమైన కంటెంట్‌తో ద్వయం హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించగా.. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.14గా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు మెకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొంతసేపటి క్రితం సమంత పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ”100 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేసి, భారీ బడ్జెట్‌తో ‘యశోద’ సినిమాని తెర‌కెక్కిస్తున్నాం.. మా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ వర్క్ ఇప్పటికే ప్రోగ్రెస్‌లో ఉంది. జూలై 15 నుండి డబ్బింగ్ పనులు స్టార్ట్ కానున్న‌యి. ఇతర భాషల డబ్బింగ్ పనులను కూడా ఒకేసారి పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. అలాగే, ఈ పాన్-ఇండియన్ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సినిమా టీజర్, పాటలు ప్రేక్షకుల అంచనాలను పెంచే విధంగా ఉంటాయి’’ అని ఆయన చెప్పారు.

మణిశర్మ సంగీతం సమకూర్చగా, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కాగా.. త్వరలోనే రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు మేక‌ర్స్. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేస్తున్న‌ ‘శాకుంతలం’ సినిమా కూడా విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement