Friday, May 17, 2024

Breaking: ఈనెల 20 శ్రీలంక నూతన అధ్యక్షుడి ఎన్నిక!

శ్రీలంక కొత్త అధ్యక్షుడిని జులై 20న ఎన్నుకోనున్నట్లు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రసన్న రణతుంగ సోమవారం ప్రకటించారు. జులై 13న అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేస్తే, జులై 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారని రణతుంగ తెలిపారు. పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించిన ప్రకారం జులై 13న రాష్ట్రపతి రాజీనామా చేస్తే .. జులై 15న పార్లమెంటు సమావేశమవుతుందని, ఆ తర్వాత రాష్ట్రపతి పదవికి జులై 19న నామినేషన్లు స్వీకరించి, జులై 20న కొత్త రాష్ట్రపతిని ఎన్నుకుంటారని అధికారిక సమాచారం..

అయితే.. శనివారం అధ్యక్షుడి భవనంలోకి వేలాదిగా చొచ్చుకువచ్చని జనం.. కోటలోని ప్రెసిడెంట్ హౌస్‌లో ఎంజాయ్​ చేస్తూ కనిపించారు. క్యారమ్ బోర్డ్ ఆడుతూ, సోఫాలో నిద్రిస్తూ, పార్క్ ఆవరణలో ఆనందిస్తూ, రాత్రి భోజనానికి ఆహారాన్ని సిద్ధం చేస్తున్న ఫొటోలు, విజువల్స్ ఎన్నో బయటికి వచ్చాయి.

కాగా, కొనసాగుతున్న నిరసనల మధ్య ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. రాష్ట్రపతి, ప్రధాని నివాసాలను ఆక్రమించిన ఆందోళనకారులు తమ పదవులకు రాజీనామా చేసే దాకా వారి ఇళ్లను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. దేశంలో అధ్వానంగా మారుతున్న ఆర్థిక పరిస్థితి ఇట్లాంటి ఉద్రిక్తతలకు దారితీసింది.  

1948లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి శ్రీలంక దాని అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, ఇది COVID-19 యొక్క వరుస వేవ్​ల నేపథ్యంలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి కొన్ని సంవత్సరాల అభివృద్ధి, పురోగతికి ఆటంకంగా మారిందనే చెప్పవచ్చు. అంతకుముందు జులై 13న అధ్యక్షుడు గొటబయ తన పదవికి రాజీనామా చేస్తారని స్పీకర్ మహింద యాపా అబేవర్దన విలేకరులతో తెలిపారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రధాని విక్రమసింఘేకు తెలియజేశారు.

ఇంతలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ప్రదర్శన ప్రారంభమైన రోజు “ప్రజా దినం”గా పేర్కొన్నారు. చమురు సరఫరా కొరత కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయవలసి వచ్చిందని, ఇంధన కొరత కారణంగా 1990 అత్యవసర అంబులెన్స్ సేవలు అనేక ప్రాంతాల్లో నిలిపి వేశారని ఆయన తెలిపారు. ఆర్థిక సంక్షోభం ముఖ్యంగా ఆహార భద్రత, వ్యవసాయం, జీవనోపాధి, ఆరోగ్య సేవలపై ప్రభావం చూపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement