Wednesday, November 29, 2023

ఎఫ్3 నుండి ఫుల్ వీడియో సాంగ్ – అద‌ర‌గొట్టిన పూజా..వెంకీ..వ‌రుణ్

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి F2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కాగా మే 27, 2022న ఈ మూవీ విడుదల కానుంది. వెంక‌టేశ్..వ‌రుణ్ తేజ్ హీరోలు..కాగా త‌మ‌న్నా..మెహ‌ర్రీన్ లు హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఎఫ్3 చిత్రంలోని లైఫ్ అంటే ఇట్టా వుండాల అనే మూడో పాటను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ..గీతా మాధురి ఈ పాటను పాడారు..కాగా కాసర్ల శ్యామ్ సాహిత్యం రాశారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటకు సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ లో హీరోలు వెంకటేష్ .. వరుణ్ తేజ్ ..హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి డ్యాన్స్ చేశారు. పూజా డ్యాన్స్ , వెంకటేష్-వరుణ్‌ల ఎన‌ర్జి ఈ సాంగ్ కి హైలెట్ గా నిల‌వ‌నున్నాయి. బాలీవుడ్ భామ సోనాల్ చౌహ‌న్ ఈ చిత్రంలో మెర‌వ‌నుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement