Sunday, April 28, 2024

పొన్నియన్ సెల్వన్2 .. వీడియోతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్..ఈ చిత్రానికి సీక్వెల్ గా పార్టు2 రిలీజ్ కానుంది. కాగా 2023 ఏప్రిల్‌ 28న పొన్నియన్‌ సెల్వన్ -2 ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్టు ప్రకటించింది లీడింగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ లైకా ప్రొడక్షన్ . ఈ మేర‌కు స్ట‌న్నింగ్ వీడియో ని లాంఛ్ చేసింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో కొనసాగనున్న సీక్వెల్‌ పార్టు అప్‌డేట్‌ను స్టార్ న‌టులు విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌ పాత్రల విజువల్స్‌ తో అందించింది మణిశర్మ టీం. పొన్నియన్‌ సెల్వన్‌-2 పస్ట్ పార్టును మించి కలర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టు తాజా వీడియోతో అర్థమవుతుంది.

తెలుగు, త‌మిళం, హిందీ, కన్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ ఫస్ట్‌ పార్టులో విక్రమ్‌, నాజ‌ర్‌, శ‌ర‌త్‌కుమార్‌, జ‌య‌రామ్‌, విక్రమ్‌ ప్రభు, కార్తీ, జ‌యం ర‌వి, పార్థీబన్‌, ప్రకాశ్ రాజ్‌, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్‌, త్రిష కీల‌క పాత్రలు పోషించారు. మరి రెండో పార్టులో కూడా వీరంతా ఉంటారా.. లేదంటే.. కొత్త యాక్టర్లెవరైనా యాడ్‌ అవుతారా..? అనేది తెలియాల్సి ఉంది. మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సీక్వెల్‌ పార్టును కూడా తెర‌కెక్కిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement