Tuesday, March 26, 2024

రాష్ట్రంలో రాజ్యాంగం వాటాను మించిన సంక్షేమం.. మంత్రి మేరుగ నాగార్జున 

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాంగంలో కల్పించిన వాటా కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి శ్రీ పద్మావతి అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలందరికీ ఎలాంటి రెకమండేషన్ లేకుండా, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ఎస్సి ఎస్టీ బిసి మైనార్టీల వర్గాలకు రాజ్యాంగ నిర్దేశిత వాటాను మించి  సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

నవరత్నాల పథకాలలో భాగంగా అర్హులైన వారందరికీ అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా వైఎస్సార్ పింఛన్లతో పాటుగా అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మన బడి నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడంతో పాటుగా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున, ఇళ్ళు లేని పేదలందరికీ ఇళ్ళు మంజూరు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 31లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, మొదటి విడతకు సంబంధించి ఇళ్ళ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన కమీషన్ సభ్యులు వడిత్య శంకర నాయక్, సాంఘీక సంక్షేమ, సాధికారత అధికారి చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement