Monday, May 13, 2024

‘లియో’ ట్రైలర్ రిలీజ్… తలపతి విజయ్ అభిమానులకు యాక్షన్ ట్రీట్

లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ల‌ప‌తి హారోగా వ‌స్తున్న మ‌చ్ ఎవైటెడ్ మూవీ లియో. మరి ఈ దసరా కానుకగా రిలీజ్ కానుంది. కాగా, అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ట్రైల‌ర్ ని ఇవ్వాల రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ ట్రైల‌ర్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ట్రీట్‌ని అందించారనే చెప్ప‌వ‌చ్చు. కాగా, లియో ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

YouTube video

ఇక ట్రైలర్ లో హీరో విజయ్ లుక్స్, స్టైల్, డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. అలానే ట్రైలర్ లో అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, త్రిష ల లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ కి అనిరుద్ అందించిన బీజీఎమ్ తో పాటు మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి ఎంతో బాగుంది. యాక్షన్ థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు ఛేజింగ్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.మొత్తంగా లియో మూవీ అక్టోబర్ 19న గ్రాండ్ రిలీజ్ కానున్న తరుణంలో దళపతి విజయ్ నటించిన ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను పెంచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement