Thursday, May 2, 2024

అమెరికా ఎంబసికి కువైట్‌ నోటీసులు…

కువైట్‌: జూన్‌ నెల ట్రాన్స్‌జెండర్లకు ఎంత ప్రత్యేకమైందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెలను పవిత్రంగా భావిస్తుంటారు. కాగా ఈ సందర్బంగా ట్రాన్స్‌జెం డర్లకు మద్దతుగా ట్వీట్‌ చేసినందుకు కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాల యం సమన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. కువైట్‌ విదేశాంగ శాఖ గురువారం ఈ సమన్లను జారీ చేసింది. కువైట్‌లో ఉన్న చట్టాతు, నిబంధనలను గౌరవించాలని, వాటికి విరుద్దంగా వ్యవహరించరాదని సమన్లలో కువైట్‌వి దేశాంగ శాఖ పేర్కొంది. కువైట్‌ సహా అనేక దేశాలలో స్వలింగ సంపర్కం నిషేధంలో ఉంది. ఆ దేశాల్లో స్వలింగ సంపర్కం శిక్షార్హమైంది.

జూన్‌ 2న కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తన ట్విట్టర్‌ ఖాతాలో మనుషులంతా ఒకే విధమైన గౌరవ మర్యాద లతో చూడాలి. ఎలాంటి వారి మధ్య అయినా ప్రేమ అనేది భయం లేకుండా ఉండా లి. ఎల్‌ జిబిటిక్యూ వ్యక్తుల మానవ హక్కులను గౌరవించడంలో కాపాడటంలో అమెరికా అధ్యక్షులు ఉన్నతంగా ఉంటారు అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పైనే కువైట్‌ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement