Friday, May 10, 2024

ఒక‌ప్పుడు తెలంగాణ యాస‌పై జోకులు … ఇప్పుడు దానిపై మోజులుః కెటిఆర్

హైద‌రాబాద్ – ఒకప్పుడు మూవీల‌లో తెలంగాణ యాస‌పై జోకులు వేసుకునే వారని, ఇప్పుడే అదే యాస‌పై అంద‌రూ మోజు ప‌డుతున్నార‌ని బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెండ్, మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు..ప్ర‌స్తుతం తెలుగు మూవీల‌లో తెలంగాణ భాష‌,సంస్కృతి ఒక భాగ‌మైందంటూ ట్విట్ట‌ర్ లో ట్విట్ చేశారు. తెలుగు సినిమా ల్లో తెలంగాణ సంస్కృతి , సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేస్తూ, ఈ ప్రాంత యాస‌లో చిత్రీక‌రిస్తున్న సినిమా ద‌ర్శ‌కులు,ర‌చయిత‌లు,నిర్మాత‌లు, న‌టీన‌టుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు..ఈ మార్పుకు ప్ర‌ధాన కార‌ణం రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పున‌రుజ్జీవ‌నానికి కార‌ణ‌మైన కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక‌ప్పుడు తెలంగాణ యాస‌ను హేళ‌న చేసిన చోటే , ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తి కీర్తి దక్కుతుంద‌ని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement