Wednesday, May 15, 2024

Follow up : నెల్లూరులో క్రిబ్‌కో ఇథనాల్‌ ప్లాంట్‌.. డిసెంబర్‌లో శంకుస్థాపన

అమరావతి, ఆంధ్రప్రభ: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్‌కో సంస్థ ఆధ్వర్యంలో బయో ఇథనాల్‌ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభం కానున్నాయి.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని క్రిబ్‌కో చైర్మన్‌ డాక్టర్‌ చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌ ఆహ్వానించారు. గురువారం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిదశలో రూ. 300 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు డీఏపీ కాంప్లెక్స్‌ ఎరువుల తయారీకి సంబందించిన ప్రాజెక్ట్‌ ఏర్పాటుపై కూడా చర్చించారు. క్రిబ్‌కో ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

ఏపీలో పెట్టుబడులు, అవకాశాలను వివరించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను విపులీకరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. సమావేశంలో క్రిబ్‌కో వైస్‌ చైర్మన్‌ వల్లభనేని సుధాకర్‌ చౌదరి, క్రిబ్‌కో ఎండీ రాజన్‌ చౌదరి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ వీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement