Wednesday, May 1, 2024

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?

హుజురాబాద్ ఉపఎన్నికలో ఈసారి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మూడు ముక్కలాట ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చేసింది. బీజేపీ నుంచి ఈటెల పోటీ చేస్తారని ఎప్పుడో తేలిపోగా.. బుధవారం టీఆర్ఎస్ పార్టీ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించేసింది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించపోవడంతో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటుందనే వాదనలు కూడా వినిపించాయి.

కాగా తాజా సమాచారం మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేయబోతున్నారనే వార్తలు వినపడుతున్నాయి. వరంగల్‌లో కీలక నేతగా ఉన్న కొండా సురేఖకు పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు పడతాయని టీపీసీసీ భావిస్తోంది. అందుకే ఆమెకు టిక్కెట్ ఇవ్వాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు కృష్ణారెడ్డి, కమలాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నాయి. అయితే చివరకు హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

ఈ వార్త కూడా చదవండి: హుజురాబాద్‌లో వారే న్యాయ నిర్ణేతలు

Advertisement

తాజా వార్తలు

Advertisement