Sunday, April 28, 2024

తుపాకీతో రౌడీషీటర్‌ హల్‌చల్‌

నిజామాబాద్‌ లో ఓ రౌడీషీటర్‌ తుపాకీతో హల్‌ చల్‌ చేశాడు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆరిఫ్‌ అనే రౌడీషీటర్‌ కారుపై వస్తూ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరిఫ్‌కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.

కాగా, గతంలో ఇటీవల దొంగతనాలు, దారి దోపిడీ కేసులో అరిఫ్‌‌పై పోలీసులు పీడీ యాక్టు పెట్టారు. ఈ కేసులో జైల్ నుంచి బెయిల్‌పై అరిఫ్ విడుదల అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement