Tuesday, April 30, 2024

మాక్స్‌వెల్ వెడ్డింగ్ సెర్మొనిలో కోహ్లీ చిందులు..

ఆర్సీబీ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్, తమిళనాడుకి చెందిన వినీ రామన్‌ని మార్చి 27న వివాహం చేసుకోగా.. బుధవారం నాటికి ఒక నెల పూర్తి అయిన సందర్భంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ బయోబబుల్‌లో ఈ జంట కోసం ప్రత్యేక వేడుకను నిర్వహించింది. చాలా మంది ఆర్సీబీ ప్లేయర్‌లు తమ సోషల్ మీడియా ద్వారా ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న ఫోటోల‌ను షేర్ చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి పార్టీని ఆస్వాదించారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత డ్యాన్స్ చేసి ‘ఊ అంటావా మావ’ పాటకు స్పిన్ ఆల్‌రౌండర్ షబాజ్ అహ్మద్‌తో కలిసి విరాట్ కోహ్లీ హుషారుగా స్టెప్‌లు వేశాడు.. దీంతో కోహ్లీ డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement