Friday, March 1, 2024

ఫోన్‌పే బ్రాండ్‌ అంబాసిడర్లుగా దుల్కర్‌ సల్మాన్‌, సమంతా..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : దక్షిణ భారత మార్కెట్ల కోసం దుల్కర్‌ సల్మాన్‌, సమంతా ప్రభును రంగంలోకి దించామని భారతదేశపు అగ్రగామి డిజిటల్‌ పేమెంట్ల వేదిక ఫోన్‌పే తెలిపింది. ఈ కొత్త క్యాంపెయిన్‌ గురించి ఫోన్‌పే బ్రాండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ… గత ఆరు నెలల్లో తాము ఇన్సూరెన్స్‌ కథలు చెప్పడం ద్వారా తమ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులను మార్కెట్‌ చేశామన్నారు. వినియోగదారులకు పనికి వచ్చే ఉత్పత్తులను ముందుకు తీసుకు వచ్చేందుకు తేలికగా అర్థమయ్యే ప్రచారాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఫోన్‌పేలో టెన్షన్‌ లేని ఇన్సూరెన్స్‌ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా, టూవీలర్‌ ఇన్సూరెన్స్‌పై దృష్టి పెట్టే ప్రచారాన్ని తాము ప్రారంభించామన్నారు. చట్ట ప్రకారం బైక్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి అయినప్పటికీ చాలా సందర్భాల్లో బైక్‌ యజమానులు ఈ అవసరాన్ని పెద్దగా పట్టించుకోరన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement