Sunday, April 28, 2024

TS | కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శవంతంగా చేస్తా : సీఎం రేవంత్

కొడంగల్‌లో తనని కింద పడేయాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని.. మనల్ని దెబ్బ తీయడానికి పన్నాగాలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ల‌న్నారు. కొడంగల్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. సోమవారం సాయంత్రం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.. ‘‘ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు.. కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం. నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే. కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. నాతో కొట్లాడే హక్కు మీకుంది. పట్టు పట్టి పని చేయించుకునే అధికారం మీకుంది. రాష్ట్రానికే నాయకత్వం వహించే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ అందించాలి. కొడంగల్ పై జరిగే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి.” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కొడంగల్‌కు తాను మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 75 ఏళ్లలో కొడంగల్‌కు ఎవరూ చేయని అభివృద్ధి చేశానన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ ప్రాంతాన్ని 4 వేల కోట్ల రూపాయలతో నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును తీసుకొచ్చానని తెలిపారు.

పదేండ్లల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొడంగల్ లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చిందా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని.. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు.

“అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా? రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement