Saturday, May 18, 2024

TS | రేపు లేజర్, లైట్ షో కి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం..

భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు.

ఈ లైట్ అండ్ సౌండ్ షోలో ‘కోహినూర్’ వజ్రం గురించిన కథను కూడా వివ‌రించ‌నున్నారు. కోహినూర్ కథతోపాటుగా.. తెలంగాణ కథ, ఇక్కడి సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకోనుంది. కాగా, తెలంగాణ ప్రాంతంలో మొద‌లైన కోహినూర్ కథ.. భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసి ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు.

ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో.. ప్రముఖ రచయిత SS కంచి రాశారు. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ శ్రీమతి సునీత గాత్రాన్ని అందించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి. కానీ.. ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీన్ని కూడా కేంద్రమంత్రి ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement