Thursday, May 9, 2024

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పుట్టిన‌రోజు – కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. కాగా రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.‘SR క‌ళ్యాణ మండ‌పం’ వంటి వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వ‌చ్చి న ‘సెబాస్టియ‌న్’ కాస్త నిరాశ‌ప‌రిచిన ఇటీవ‌లే వ‌చ్చిన ‘స‌మ్మ‌త‌మే’ మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి.  ఈ యంగ్ హీరో ప్రస్తుతం బిజీ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. నేడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న కొత్త ప్రాజెక్టుల నుంచి అప్డేట్స్ వ‌స్తున్నాయి. శుక్ర‌వారం ఆయ‌న పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీస్ వారు తమ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘మీటర్’ అనే టైటిల్ ను సెట్ చేసినట్లుగా చెబుతూ.. కిరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రంగా అర్థమవుతుంది. ఈ సినిమాకి రమేష్ కాడూరి దర్శకత్వం వహించగా.. సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement