Thursday, May 2, 2024

Kieron Pollard | ఇంగ్లండ్ జ‌ట్టు కోచ్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్..

వెస్టిండీస్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, స్టార్‌‌ ప్లేయర్ కీరన్‌ పొలార్డ్ ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది అమెరికా – వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన పొలార్డ్‌.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పొలార్డ్‌కు కోచ్‌గా ఇదే తొలి సవాల్‌. విండీస్‌ అతడి స్వదేశం కావడం ఇంగ్లండ్‌కు కలిసొచ్చేదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement