Sunday, May 19, 2024

పాటియాలలో ఖలిస్తానీ వర్సెస్‌ శివసేన.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

పంజాబ్‌లోని పాటియాలాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు.. తల్వార్లు పట్టుకుని పోలీసుల వెంట పరుగులు పెట్టారు. దీంతో పాటియాలాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యాంటీ ఖలిస్తాన్‌ నిరసన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు పాటియాలాలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

ఖలిస్తానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ర్యాలీ..

పంజాబ్‌లోని పాటియాలలోని కాళీమాత ఆలయం సమీపంలో శుక్రవారం శివసేన కార్యకర్తలు, సిక్కు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గానికి చెందిన వారు మరో వర్గంపై రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూశారు.. పంజాబ్‌ శివసేన వర్కింగ్‌మ ప్రెసిడెంట్‌ హరీష్‌ సింగ్లా ఆధ్వర్యంలో పాటియాలాలో ఆ పార్టీ కార్యకర్తలు ఖలిస్తానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఖలిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటూ శివసేన కార్యకర్తలు నినాదాలు చేయగా.. వీరికి వ్యతిరేకంగా సిక్కు వర్గాలు కత్తులు చేతిలో పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. దీంతో ఇరు వర్గాలు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డాయి.

బాధ్యులపై చర్యలు తప్పవు :సీఎం..

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ స్పందిస్తూ.. అనుకోకుండా ఈ ఘర్షణ చోటు చేసుకుందన్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీజీపీతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తగు చర్యల గురించి అడిగి తెలుసుకున్నట్టు వివరించారు. పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పంజాబ్‌లో మళ్లి శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement