Friday, May 3, 2024

తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 14,917 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజా.. కొత్తగా 14,917 కరోనా కేసులు నమోదవగా, 32 మంది బాధితులు మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,42,68,381కి చేరగా, 5,27,069 మంది కరోనాకు బలయ్యారు. ఇందులో 4,36,23,804 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, మరో 1,17,508 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 14,238 మంది కరోనా నుంచి బయటపడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 7.52 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.27 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతంగా ఉందని, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


Advertisement

తాజా వార్తలు

Advertisement