Saturday, April 27, 2024

ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను కేసీఆర్ సర్కార్ పూర్తి చేయలేకపోయింది : రేవంత్ రెడ్డి

మునుగోడు ప్రజలను మరోసారి సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ప్రజలకు సాగునీరు అందండం లేదని తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను కేసీఆర్ సర్కార్ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కమ్యూనిస్టులను అత్యంత చులకనగా మాట్లాడిన వ్యక్తి కేసీఆరేనని, దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కార్మికుల పక్షాన పోరాడే.. కమ్యూనిస్టుల పట్ల గౌరవం ఉందని, కార్మికుల జీవితాల్లో చీకట్లు తెచ్చిన కేసీఆర్ను కమ్యూనిస్టులు ఎలా క్షమించారు? అని ప్రశ్నించారు. కేసీఆర్తో కలుస్తామన్న కమ్యూనిస్టుల నిర్ణయం నిరాశకు గురిచేసిందని తెలిపారు. లోక్సభలో విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు. ఆగస్టు 8న విద్యుత్ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు.. టీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా సభలో లేరని తెలిపారు. దీన్ని బట్టి విద్యుత్ బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు తెలిపినట్లే అర్థమవుతోందన్నారు. బీజేపీకి సంపూర్ణంగా టీఆర్ఎస్ లొంగిపోయిందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement