Friday, May 3, 2024

కేసీఆర్ పుణ్య‌మా అని 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి..7ఏళ్ల‌లో జ‌రిగింది – ఎర్రోళ్ల శ్రీనివాస్

సమైక్య పాలనలో ప్రాజెక్టులను అడ్డుకున్నారని.. 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి..7ఏళ్ల‌లో అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించార‌ని టి ఎస్ ఎమ్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు… స్థానిక సంగారెడ్డి ఐ పీ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం ఏర్పడినప్ప‌టి నుండి .. నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి వరకు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోకుండా ప్రాజెక్టులకు అడ్డుపడి సంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతంలో సింగూరు జలాలు ఉన్నప్పటికీ దీపం కింద చీకట్ల ఆ ప్రాంత వాసులకు కరువైందని.. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏడేళ్లలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారన్నారు. రైతుల అభివృద్ధికి 24 గంటల కరెంటు కొరతలేని రైతు బంధు, రైతు భీమా అన్నారు. అన్ని విధాల ఆదుకునే వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. రేపు జరగబోయే నారాయణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర నాలుగు వేల 25 కోట్లతో రూపొందిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కేసీఆర్ ప్రారంభిస్తున్నారని తెలిపారు. దీనివలన 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామ‌న్నారు.. సంగారెడ్డి జిల్లా హరిత జిల్లాగా మారిపోతుందని ఆయన అన్నారు. రేపు జరగబోయే సీఎం సభకు జిల్లాలో ఉన్న కార్యకర్తలు ,నాయకులు ,రైతులందరూ విచ్చేసి సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement