Thursday, May 2, 2024

Delhi | కవిత స్పందన చిన్నపిల్లల ప్రకటనలా ఉంది.. దర్యాప్తు సంస్థలతో దాగుడుమూతలు : అనంత్ మాలిక్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఫేక్ చాట్ స్క్రీన్ షాట్లతో తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించడం చిన్నపిల్లల ప్రకటనలా ఉందని సుకేశ్ చంద్రశేఖర్ లాయర్ అనంత్ మాలిక్ ఎద్దేవా చేశారు. తన క్లయింట్ సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తినవన్నీ నిజాలంటూ గురువారం ఆయన ఢిల్లీ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సుకేశ్ తన వాదనలకు మద్దతుగా అనేక డిజిటల్ సాక్ష్యాలను అందజేశారని తెలిపారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 65 బి ప్రకారం వాంగూల్మం సుకేశ్ వాంగ్మూలాన్ని జత చేశామని వెల్లడించారు.

ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు కవిత దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అనంత్ మాలిక్ ఆరోపించారు. న్యాయాన్ని విశ్వసించే, అనుభవజ్ఞులైన, నిఖార్సైన రాజకీయ నేత ఎవరైనా ఈ విషయంలో విచారణను స్వాగతిస్తారని, దాని ద్వారా నిజానిజాలు బయటికొస్తాయని నమ్ముతారని ఆయన అభిప్రాయపడ్డారు. కవిత ప్రతిస్పందన చూస్తుంటే దర్యాప్తు సంస్థలతో దాగుడుమూతలు ఆడుతున్నట్టున్నట్టు ఉందన్నారు.

ఆమె తన ప్రకటనలో తన వాక్పటిమా నైపుణ్యాన్ని చూపారని అనంత్ విమర్శించారు. ఆమె ప్రకటన మీడియా, రాజకీయ పార్టీలతో బ్లేమ్ గేమ్‌లా ఉందని దుయ్యబట్టారు. ప్రస్తుతం నడుస్తున్న వ్యవహారాలు ప్రత్యేక ఏజెన్సీల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినవని, సాధారణ ప్రజలలో ప్రజాదరణ పోటీకి సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. ఈ వారంలోనే తన క్లయింట్ సుకేశ్ చంద్రశేఖర్ ద్వారా ఈ అంశంపై వివరణాత్మక రిప్లై వస్తుందని అనంత్ మాలిక్ చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement