Sunday, April 28, 2024

క‌ర్నాట‌క‌ బడ్జెట్ 2023 : 20శాతం పెరిగిన‌ లిక్కర్ ఎక్సైజ్ సుంకం.. వెల్ల‌డించిన‌ సిద్ధరామయ్య

కర్నాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూరులోని విధానసౌధ (పాల‌సీ బిల్డింగ్)లో 14వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని 20 శాతం పెంచినట్లు ప్రకటించారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)పై అదనపు ఎక్సైజ్ సుంకం (ఏఈడీ) కూడా 20 శాతం పెరిగిందని వెల్ల‌డించారు. బీర్ పై AED 10 శాతం (175 శాతం నుండి 185 శాతానికి) పెరిగిందని తెలిపారు. సిద్ధరామయ్య రూ.3,27,747 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రకటించగా, ఇందులో రూ.2,50,933 కోట్లు రెవెన్యూ వ్యయానికి, రూ.54,374 కోట్లు మూలధన వ్యయానికి, రూ.22,441 కోట్లు రుణాల చెల్లింపునకు కేటాయించారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఐదు ఎన్నికల హామీల నిధుల కేటాయింపులను ప్రస్తావిస్తూ, ఏటా దాదాపు రూ.52,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ హామీల వల్ల 1.3 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ హామీలు అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి), ప్రతి కుటుంబంలోని మహిళ పెద్దలకు నెలవారీ రూ.2,000 (గృహ లక్ష్మి), ప్రతి సభ్యునికి 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం వంటి అనేక సంక్షేమ చర్యలను కలిగి ఉన్నాయి.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు (అన్న భాగ్య), నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువతకు రూ.3,000 నెలవారీ భత్యం. 18- 25 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌లకు రూ.1,500 రెండు సంవత్సరాల పాటు (యువనిధి), ప్రజా రవాణా బస్సులలో (శక్తి) మహిళలకు ఉచిత ప్రయాణం. అలాగే బెంగళూరులో కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించే ప్రయత్నంలో తదుపరి అభివృద్ధి కోసం BMRCL నమ్మ మెట్రోకు 30,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సిఎం సిద్ధరామయ్య తెలిపారు. అంతేకాకుండా రాజధాని చుట్టూ అభివృద్ధి పనులకు రూ.45 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement