Sunday, April 28, 2024

Karnataka : వెన‌క్కి మ‌ళ్లిన గాలి…..బీజేపీలో చేరిన జనార్దన్‌ రెడ్డి

లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్నాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గనుల వ్యాపారి, మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్‌ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు.

సోమవారం ఉదయం ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఐ విజయేందర్‌ సమక్షంలో భార్య అరుణ లక్ష్మితో కలిసి కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. తన కేఆర్‌పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

- Advertisement -

సొంత‌గూటికి రావ‌డం సంతోషం..
ఈ రోజు నేను కేఆర్‌పీపీని బీజేపీలో విలీనం చేసి.. ఆ పార్టీలో చేరాను. మూడోసారి మోదీకి మద్దతు ఇవ్వడానికి నేను తిరిగి సొంతగూటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. బేషరతుగా పార్టీలో చేరాను. నాకు ఎటువంటి పదవులూ అవసరం లేదు.. అని బీజేపీలో చేరిన అనంతరం గాలి జనార్దన్‌ రెడ్డి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. మరోవైపు గాలి జనార్దన్‌ రెడ్డి దంపతులకు యడియూరప్ప, ఇతర బీజేపీ నేతలు పార్టీలోకి స్వాగతం పలికారు.
మైనింగ్ కేసులో జైలుకు..
ఒకప్పుడు క‌న్న‌డ‌ రాజకీయాల్లో చక్రంతిప్పిన గాలి జనార్దన్‌ రెడ్డి మైనింగ్‌ అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట‌య్యాడు. ఈ కేసులో సీబీఐ అధికారులు 2011 సెప్టెంబర్‌లో అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన గాలి మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే, గతంలోలాగా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. గత ఎన్నికల్లో తన పార్టీ తరపున ఆయన ఒక్కరే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీలో చేరి తనపార్టీని విలీనం చేశారు. తాజా పరిణామంతో బళ్లారి, కొప్పళ, రాయచూర్‌, హావేరి జిల్లాల్లో పార్టీకి మరింత బలం వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement