Friday, April 26, 2024

100డేస్ కంప్లీంట్ చేసుకున్న.. కాంతార‌

క‌న్న‌డ చిత్రం కాంతార సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీకావు.. కేజీఎఫ్ చిత్రం త‌ర్వాత క‌న్న‌డ ప‌రిశ్ర‌మ పేరుని మ‌రింత‌గా పెంచింది కాంఆర‌. కాగా ఈ చిత్రంలో రిషబ్ శెట్టి – సప్తమి గౌడ జంటగా నటించారు… కన్నడలో క్రితం ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. చాలా తక్కువ సమయంలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. శ‌నివారంతో ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మేకర్స్ అందుకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చ‌చేశారు. ఈ సినిమాలో హీరోతోపాటు రచయిత .. దర్శకుడు కూడా రిషబ్ శెట్టినే కావడం విశేషం. కన్నడతో పాటు ఇతర భాషల్లోను విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లోను హిట్ టాక్ ను సొంతం చేసుకుంది .. లాభాలను తెచ్చిపెట్టింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చారు. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement