Tuesday, March 28, 2023

గొల్ల, కురుమల అభివృద్ధికి కేసీఆర్ కృషి.. మంత్రి త‌ల‌సాని

గొల్ల, కురుమల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కోకాపేటలో యాదవ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు మంత్రి, యాదవ, కురుమ ప్రజాప్రతినిధులు పరిశీలించారు. నిర్మాణ పనులు ముగింపు దశకు చేరాయన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 41 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలను కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వందేన‌న్నారు. రాజకీయంగా, సామాజికంగా గొల్ల, కురుమల‌కు పెద్దపీట వేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేన‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement